
హైదరాబాద్ లోని మైత్రివనంలో ఉన్న HMDAలో జరిగిన విజిలెన్స్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం నుంచి దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్.. గత ప్రభుత్వం ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా.. 4, 5వ అంతస్తులో రికార్డు సెక్షన్ నుంచి 51 అనుమతులకు సంబంధించి మాన్యువల్ ఫైల్స్ మాయం అయినట్లు నిర్ధారించారు. కాగా.. ఈ విషయాన్ని విజిలెన్స్ బృందం ఉన్నతాధికారులకు తెలిపారు.
Read Also: Chandrababu: ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం..
ఉదయం 7 గంటల నుంచి విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. HMDAకు సంబంధించి 4, 5, 7వ అంతస్తులో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అయితే.. గత తొమ్మిదేళ్ల కాలంలో గత ప్రభుత్వం అనుమతులిచ్చిన కీలక ఫైల్స్ మాయమాయ్యాయి. ఐతే.. దీని వెనుక ఎవరి హస్తం ఉంది.. ఏ విధంగా వీటిని మాయం చేశారు.. ఎప్పుడు మాయం చేశారనే దానిపై దర్యాప్తు కొనసాగనుంది. అంతేకాకుండా.. పలువురు అధికారులను కూడా ఫైల్స్ మాయంపై ప్రశ్నించనున్నారు.
Read Also: NABARD Recruitment 2024: నాబార్డ్ లో 31 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?