
మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమేనా కాదా..? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయారని.. ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దని.. బాధ్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో ఏం జరిగిందో చూపించారని అన్నారు. ఆర్థిక అంశాలు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ప్రజలకు వివరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సీఎం, మంత్రులు మేడిగడ్డ వెళ్లి చూసి వచ్చారని చెప్పారు.
Balineni Srinivas Reddy: ఈ ఎన్నికల్లోనే నా చివరి పోటీ.. బాలినేని సంచలన వ్యాఖ్యలు
అయితే.. నల్గొండలో నిర్వహించిన సభలో కేసీఆర్ మేడిగడ్డనా, బొందల గడ్డనా అని ఆరోపణలు చేశారు.. అక్కడికి ఎందుకు పోతున్నారు అన్నాడు కేసీఆర్.. నీ అవినీతిని చూసేందుకు పోయామని జగ్గారెడ్డి చెప్పారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ నీతులు చెప్తున్నారు.. రేవంత్ మాటలు గురించి మాట్లాడే వీళ్లు.. కేసీఆర్ మాటలు తప్పు అని ఎందుకు చెప్పరు అని మండిపడ్డారు. కేసీఆర్ ఒకటి అంటే.. మేము వంద అంటాం.. తొమ్మిదేళ్లు సంచులు నింపుకున్నది మీరని దుయ్యబట్టారు. మేడిగడ్డ బ్యారేజీ నా.. బొందల గడ్డనో ముందు తేల్చండని అన్నారు. తెలంగాణ ప్రజలకు దీనిపై క్లారిటీ ఇవ్వాలని కేసీఆర్ పై విమర్శలు చేశారు.
Hyderabad: హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు..
ఇదిలా ఉంటే.. మా సీఎం పిలిచినప్పుడు మేడిగడ్డకు కేసీఆర్ ఎందుకు రాలేదని కేటీఆర్ ను ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చకు కూడా ఎందుకు రాలేదు మీ నాయనా జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు. కేసీఆర్ రాకుండా మేడిగడ్డకు పోయినా వృధా అని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కడియం శ్రీహరి మాటలకు విలువ లేదు.. బాల్క సుమన్ చిన్న పిలగాడు.. పిలగాడి తీరు ఉండాలని దుయ్యబట్టారు.