Leading News Portal in Telugu

Etela Rajender: కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కి ఓటు వేశారు.. ఈటల కామెంట్



Etala Rajender

Etela Rajender: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారని మాజీ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజల కష్టసుఖాల గురించి ఆలోచిస్తూ పేదలకు అండగా ఉంటూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారని తెలిపారు. 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని.. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా 24 గంటల నీళ్లు ఇవ్వాలని కోరారు. రైతులకు రుణ మాఫీ చేస్తానని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే అని తెలిపారు. డిజిటల్ వేవస్థ తీసుకొచ్చిన ఘనత మోడీ ది అన్నారు.

Read also: Hyderabad High Alert: బెంగుళూరులో పేలుళ్లు.. హైదరాబాద్ లో హై అలర్ట్..

140 కోట్ల ప్రజలకు మోడీ సేవకుడు మాత్రమే అన్నారు. నాడు వందల మంది రామ మందిరము కోసం చనిపోయారని, నేడు మోడీ రామమందిరం నిర్మాణం చేసిన ఘనత నరేంద్ర మోడీ ది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాడుతామన్నారు. దేశంలోనే భాజపా ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భాజపా పోరాటం చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్, నీరు, ఎరువులు అందక ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఏడు లక్షల చొప్పున నిధులు కేటాయించి నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందన్నారు. అందుకే దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసేందుకు సిద్ధం కావాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.
Jr Ntr : ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు.. న్యూ లుక్ ఫోటోలు వైరల్..