Leading News Portal in Telugu

Radisson Drugs Case: సంచలనం రేపుతున్న మీర్జా రిమాండ్‌ రిపోర్ట్‌.. స్నాప్ చాట్ ద్వారా డ్రగ్స్ సప్లై



Radisson Drugs Case

Radisson Drugs Case: తెలంగాణలో రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్. అప్పటికే 14 మందిని అదుపులో తీసుకున్న పోలీసుల విచారణలో రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ హాజరైన విషయం తెలిసిందే.. ఇక రిమాండ్ లో వున్న మీర్జా వాహిద్ బేగ్ విచారించగా పోలీసులకు రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్ కు, ప్రవీణ్ కు డ్రగ్స్ ను పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై, డెలివరీ ముఠా చేస్తున్నారని తెలిపారు. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానందుకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలోనే 10సార్లు డ్రగ్ సరఫరా చేసినట్లు గుర్తించారు. మిర్జా వహీద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పోలీసులు పేరును ప్రస్తావించడం కీలకంగా మారింది.

Read also: Top Headlines@1PM: టాప్ న్యూస్

ఈనెల 29న గచ్చిబౌలి ఐ.ఎస్.బి వద్ద నాలుగు కవర్లలో కొకైన్ ను డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. A13 అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ పెడ్లరతో ఏడాదిగా మీర్జా వాహిద్ బేగ్ పరిచయం ఏర్పడింది.. వీరిని స్నాప్ చాట్ ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకొని మీర్జా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కొకైన్ ను సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా మిర్జా వాహిద్ బేగ్ విక్రయిస్తున్నాడని సమాచారం. రాడిసన్ హోటల్లో పదిసార్లు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. రెండు గ్రాముల కు 30 వేలకు గూగుల్ పే ద్వారా చెల్లించారని, ఫిబ్రవరి 24న మధ్యాహ్నం కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు హాజరయ్యారని తెలిపారు. మీర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్, గచ్చిబౌలి ISB , జూబ్లీహిల్స్ లో కొకైన్ ను అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.
Dumka Gangrape Case : జార్ఖండ్‌లో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం.. అదుపులో ముగ్గురు వ్యక్తులు