Leading News Portal in Telugu

Alleti Maheshwar Reddy : కాళేశ్వరంపై ఆ రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయి..



Maheshwar Reddy

కాళేశ్వరం పై ఆ రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన ఆదిలాబాద్ లో ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు వద్దకు వారు పిక్ నిక్ కు వెల్తున్నారు..పోటీ పడి ఎమ్మెల్యేలను తీసుకోని టూర్లు వేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వాళ్లంతా డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై ఒక్క లేఖ ఇస్తే సీబీఐ రంగంలోకి దిగుతుందని, సీబీఐకి ఇవ్వండి ..ఎవ్వరి చిత్తశుద్ది ఏంటో బయటపడుతుంది…దోషులు ఎవ్వరో తేలుస్తారన్నారు. రాష్ట్రం లో సీబీఐ ఎంక్వైరీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలని మహేశ్వర్‌ రెడ్డి.

Nuclear Cargo: చైనా నుంచి పాక్ వెళ్తున్న నౌకని ముంబైలో నిలిపివేత.. “అణు కార్గో” ఉన్నట్లు అనుమానం..

అంతేకాకుండా.. సీఎం లేటర్ ఇస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభం అవుతుందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేల్లో గ్యాప్ మీడియా సృష్టే అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలో సఖ్యత లేదనేదాంట్లో నిజం లేదని, సిట్టింగ్ ఎంపి ని కాదన్నప్పుడు దానికో ప్రోసిజర్ ఉంటది..దాని ప్రకారం అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకోసం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి మోడీ అని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ది, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నుంచి గట్టేక్కాలంటే అది మోది వల్లనే సాద్యమన్నారు మహేశ్వర్‌ రెడ్డి. రాష్ట్రం ప్రగతిపథంలో నడవాలంటే మోది ఆశ్వీర్వాదం కావాలన్నారు.

Breaking News: ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా..