
Sridhar Babu: పోలీస్ శాఖ వారు ఎవరిని కూడా అనవసరంగా వేధించవద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీపాదరావు ఆశయాల మేరకు మంథని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. మంథని ప్రాంతం శాంతిభద్రలతో కూడిన చదువుల తల్లి ప్రాంతంగా ఏర్పడడానికి అందరూ సహకరించాలన్నారు. శ్రీపాదరావు ఆశయాల మేరకు రైతులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. మంథని ప్రాంతంలో వాణిజ్య వ్యాపారాల అభివృద్ధి కోసం మంథని వద్ద రెండు జిల్లాల పరిధిలో గోదావరి నదిపై మంథని వద్ద వంతెన నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. చిల్లర గాళ్లు చేసి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇలాంటి విషయాల్లో చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. చట్టం పరిధిలో కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని కార్యకర్తలకు ఉపదేశించారు. పోలీస్ శాఖ వారు ఎవరిని కూడా అనవసరంగా వేధించవద్దని ఆదేశించారు.
Read also: Elevated Corridors: తెలంగాణకు175 ఎకరాల రక్షణ భూమి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
మంథనిలో గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లును మంత్రి పంపిణీ చేశారు. అధికారంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ, మరమ్మతులకు ఎందుకు చర్యలు తీసుకోలేదో కేటీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాడు పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని, రాజకీయంగా మన ప్రభుత్వంపై బురదజల్లాలని కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు సందర్శనలో కనీసం భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి నిపుణులైన ఇంజనీర్ల సలహాతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ జస్టిస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఖాళీల విషయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల అమలుకు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
Yadagirigutta: యదాద్రి ఇకపై యాదగిరిగుట్ట..! పేరు మార్చేందుకు కాంగ్రెస్ ఆలోచన..?