
BRS MLA: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసంలో ఆయన కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. మంత్రి పొంగులేటి వెంకటరావుతో కలిసి సీఎం రేవంత్ వద్దకు వెళ్లారు. ఈ భేటీతో ఆయన పార్టీ మారతారనే చర్చ జోరందుకుంది. కానీ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాత్రం ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని అంటున్నారు. మరి దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. గత సంవత్సరం డిసెంబర్ లో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై స్పందిస్తూ కొట్టిపడేశారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.
Read also: Pavitranath: మొగలిరేకులు దయ మృతి.. భార్య చేసిన ఆరోపణలు.. దానివలనే
రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న పాత ఫొటోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ అబద్ధమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కు విధేయుడిగా ఉంటానని, జీవితాంతం కేసీఆర్ తో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిట్టని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి దిగిన ఫొటోను కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే ఏసీపీకి ఫిర్యాదు చేశామన్నారు. అయితే మళ్లీ ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసంలో ఆయన కుటుంబసభ్యులతో సమావేశమవడం సంచలనంగా మారింది.
Kakani Govardhan Reddy: సొంత ప్రాంతంలో గెలవలేని చంద్రబాబు.. వైసీపీ నేతలను విమర్శిస్తున్నారు: మంత్రి కాకాణి