
ప్రధాని మోడీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని మోడీకి తెలంగాణ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను బీజేపీ విడుదల చేసింది. రేపు ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మోడీ….11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ ప్రధాని మోడీ పాల్గొంటారు. మధ్యాహ్నం తమిళ్ నాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు రాత్రి రాజ్ భవన్ లో బస చేస్తారు ప్రధాని మోడీ. 5 వ తేదీన సంగారెడ్డిలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలు దేరనున్న మోడీ.. 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన లు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. 11.30 నుండి 12.15 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటన తర్వాత ఒడిషాకు పీఎం మోడీ వెళ్లనున్నారు. మొత్తం 15 వేల 718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు మోడీ.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే
ఇందులో ఆదిలాబాద్ లో 6,697 కోట్లు, సంగారెడ్డిలో 9,021 కోట్లు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. బేగం పేట లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. లింగం పల్లి నుండి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ ను కూడా ప్రధాని రేపు ఎల్లుండి ప్రారంభిస్తారు. వీటితో పాటు ఎన్టీపీసీని ప్రారంభించనున్నారు. అయితే.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు కన్నా ముందు ప్రధాని రాష్ట్రానికి వస్తుండడం తో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు… కాంగ్రెస్ పై న ఎలాంటి కామెంట్స్ చేస్తారు అనే దాని పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ లో ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోడీ పూరించనున్నారు. అయితే.. నిన్ననే లోక్ సభ ఎన్నికల కోసం ముందుగానే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.. ప్రధాని పర్యటన నేపథ్యం లో ఏర్పాటు ల పై దృష్టి పెట్టారు రాష్ట్ర బీజేపీ నాయకులు.
Pakistan: సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని పాకిస్తాన్ తీర్మానం..