
అదానీ, అంబానీ ఆస్తిని కూడా సగటు భారత పౌరునితో పోల్చితే ఎలా..? అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అట్లా చూసి సగటు పౌరుని జీవన ప్రమాణాలు పెరిగాయని ఎట్లా అంటారు అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. రాముని విగ్రహం పెట్టి ప్రజలకు మంచి చేశాం అనడం తప్పు.. రాముణ్ణి మేము తప్పు పట్టడం లేదు.. రామ రాజ్యం కావాలి.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి అని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.
Read Also: Regina Cassandra : త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న రెజీనా.. వరుడు ఏవరంటే?
తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. దానికి కొద్దీగా సమయం పడుతుంది అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కేవలం మూడు నెలల్లోనే ఇప్పటికే 4 గ్యారెంటిలు అమలు చేస్తున్నాం.. ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ కు మహా అంటే 1, 2 పార్లమెంట్ స్థానాలు రావొచ్చు.. బీజేపీ ప్రభావం కూడా పెద్దగా లేదు అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ వి అన్ని బట్ట కాల్చి మీద వేసే మాటలే.. ప్రజలు తేలుస్తారు.. ఇప్పటికే ఒకసారి కర్రు కాల్చి వాత పెట్టారు అని జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు.