Leading News Portal in Telugu

CM Jagan : నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన



Cm Jagan

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9.10 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. రాడిసన్‌ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్‌..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు.

అక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘భవిత’ పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారు. అనంతరం విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్‌ మల్లికార్జున, ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ సోమవారం పరిశీలించారు.