Leading News Portal in Telugu

Jogu Ramanna : నిన్నటి దాకా చౌకిదారు.. ఇప్పుడు మోడీకా పరివార్ అంటా..!



Jogu Ramanna

దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్కు ఇవ్వలేదని, మోడీ ఎందుకు వచ్చినట్టు అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆదిలాబాద్ పై చిన్న చూపు చూసారని, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. 4 మంది ఎమ్మెల్యేలను ప్రజలను గెలిపిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఆయన మండిపడ్డారు. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఎన్నికల సభ నిర్వహించారని, ఇప్పటి దాకా మీ డ్రామాలు నడిచాయని, మోడీ, రేవంత్ రెడ్డి లు ఒక్కరికి ఒక్కరు పొగుడు కోవడం తప్పా జిల్లా ప్రజలకు ఒరిగింది ఏంటని ఆయన అన్నారు.

Machani Somnath: మా మద్దతు మాచాని సోమనాథ్‌కే.. ఎమ్మిగనూరు టికెట్‌ కేటాయించాలి..

ఆదిలాబాద్ కు ఇచ్చింది గుండు సున్నా అని ఆయన ధ్వజమెత్తారు. ఆదివాసీలు అని గొప్పలు చెప్పే బీజేపీ నేతలు ఆదివాసీ అయిన సిట్టింగ్ ఎంపీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఏ టీం, బీ టీం లు అని ఆయన అన్నారు. నిన్నటి సభ తో కాంగ్రెస్ బిజేపి నేతల రహస్య ఒప్పందం బయట పడిందని, కాంగ్రెస్, బీజేపీ లు గ్యారంటీల పాట పాడుతాండ్లు అని ఆయన అన్నారు. నిన్నటి దాకా చౌకిదారు.. ఇప్పుడు మోడీకా పరివార్ అంటా అని ఆయన విమర్శలు గుప్పించారు. వారసులు ఉంటే తప్పేం కాదు… నీకు వారసులు లేరని, మా పార్టీల నుంచి తీసుకొని తెల్లారే టికెట్లు ఇస్తున్నారన్నారు. బీజేపీ ఎంత భారీ పార్టీనో అర్థం అవుతుందని, కిషన్ రెడ్డి కి మాజీ మంత్రి రామన్న కౌంటర్ అని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ ఎన్నికల్లో మొదట ఓడిపోయే సీట్లు సికింద్రాబాదే అని ఆయన వ్యాఖ్యానించారు. నీ కుర్చీ కదులుతుందని కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Narendra Modi : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు