Leading News Portal in Telugu

Etela Rajender : తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ని బండకేసి కొడితే దిక్కు దివానా లేకుండా పోయింది



Etela

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజలు పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. నేడు రెండో రోజు సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోడీ. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దామన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ని బండకేసి కొడితే దిక్కు దివానా లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు మోడీ అని ఆయన కొనియాడారు. నిన్న సీఎం రేవంత్ ప్రధాని కార్యక్రమానికి వచ్చారు అది సంతోషమన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీ మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా అని అభివర్ణించారు. అభివృద్ధికి మారు పేరు మోడీ అని, అభివృద్ధిలో తెలంగాణాని భాగస్వామ్యం చేసేందుకు ప్రధాని 10 లక్షల కోట్లు ఇచ్చారన్నారు. ఢిల్లీ నుంచి నిధులు పంపిస్తే BRS ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, కాంగ్రెస్ మాయమాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు లక్ష్మణ్‌. ప్రధాని మోడీ కుటుంబం ఎక్కడ అని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు.

My Dear Donga : నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న మై డియర్ దొంగ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణాని దోచుకునట్టే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుందని, ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, ఈ రెండు పార్టీల DNA ఒక్కటే వీళ్లకు MIM తొత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పడాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కేటీఆర్‌ని సీఎం చేయాలని చూస్తుందన్నారు కిషన్‌ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చూస్తుందని, మోడీ గ్యారెంటీ ఇచ్చారంటే అది జరిగి తీరుతుందన్నారు. తెలంగాణలో 17 కి 17 సీట్లు బిజెపి గెలవాలన్నారు.

Malavika Mohanan : స్టైలిష్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న మలయాళి బ్యూటీ..