
రాజకీయంగా ఎన్నికల సమయంలో పొత్తులు సాధారణం అని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. బీఎస్పీతో పొత్తు కోసం రాష్ట్రంలో సంప్రదింపులు జరిపాం.. కానీ, జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో బీఎస్పీ లేదు.. ఇపుడు బీఆర్ఎస్, బీఎస్పీతో పొత్తు కుదుర్చుకుంది.. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ జాతీయ నేత కేసి వేణుగోపాల్ ను కలిశాను.. రాష్ట్ర రాజకీయాలు, నాగర్ కర్నూల్ అంశంపై కూడా చర్చించాను.. నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో నాకు డౌట్ లేదు అని మల్లు రవి చెప్పుకొచ్చారు.
Read Also: Jaragandi: జరగండి – జరగండి.. గేమ్ చేంజర్ వచ్చేస్తున్నాడు!
ఇక, మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా పెద్దన్నలా పని చేయాలని సీఎం రేవంత్ చెప్పారు.. దానికి కిషన్ రెడ్డి రేవంత్ నే వెళ్లి అడగండి అని మీడియాతో అనడం ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం అని మల్లు రవి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని రేవంత్ కోరలేదు.. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.. రాజ్యాంగ స్ఫూర్తికి వక్ర భాష చెప్పడాన్ని ఖండిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రధాని ఉన్నా మేం గౌరవిస్తాం.. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.. 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో అర్ధం కావడం లేదు అని కిషన్ రెడ్డి అంటున్నారు.. ఇప్పటికే 18 కోట్ల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయణిస్తున్నారు తెలిపారు.. గద్వాలలో 1200 మంది 10 లక్షల చొప్పున ఉచితంగా వైద్య సౌకర్యం పొందారు.. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారు.. పథకాల అమలు అర్ధం కాకపోతే ఆర్టీఐ ద్వారా వివరాలు తెలుసుకోవాలి అని సూచించారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై కావాలనే బురద జల్లుతున్నారు అని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి వెల్లడించారు.