Leading News Portal in Telugu

Ponnam Prabhakar: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలి..



Ponnam

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ లో దోబిఘాట్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం మడ్ ఫోర్డ్ దోబిఘాట్ ఫేజ్ -2లో మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ వెన్నెల గద్దర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Read Also: Minister Peddireddy: టీడీపీలో ఎంతమంది చేరినా వైసీపీదే విజయం

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలన్నారు. మనలో మనకు ఐక్యత వచ్చి సంఘా జీవులుగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేసినపుడే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదం పార్టీలో 30 సంవత్సరాలుగా ఉండడంతో మంత్రిని చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా నియమించారు అని చెప్పుకొచ్చారు. కుల వృత్తులు మారుతున్నాయి.. అందుకే సాంకేతికతకు అనుగుణంగా మారాలన్నారు. బలహీన వర్గాల శాఖ తరపున 119 మంది ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యుల నిధులతో ఒక్కొక్కరు ఒక్కో మండలంలో దోబిఘాట్ నిర్మించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

Read Also: BRS- BSP Alliance: తెలంగాణలో కొత్త పొత్తు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ

ప్రకృతిలో వచ్చే కల్లునీ పెద్ద పెద్ద హోటల్ లో అమ్మేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణులకు మంగలి షాపులు, ఇతర కుల వృత్తులు మోడర్న్ గా మారాలి.. ప్రభుత్వ ఆదేశాలను క్షేత్ర స్థాయిలో మరింత ముందుకు తీసుకుపోవాలి అని పిలుపునిచ్చారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లు ప్రభుత్వం ఇస్తది ఎవరు కనెక్షన్లు కట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చాం.. ఖజానా ఖాళీ అయింది, ఆ గల్లా నిండలంటే టైం పడుతుంది అని తెలిపారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం.. బలహీన వర్గాల ఉన్నతికి కుల గణన తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.