
Praneeth Rao suspension: డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెండ్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. అయితే, కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. అందులోని ముఖ్యమైన కాల్ డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడని తెలిపింది. ఇక, కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొనింది. హెచ్డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.
Read Also: Rahul Gandhi: జై శ్రీరామ్, మోడీ నినాదాలు, బంగాళాదుంపలతో రాహుల్ గాంధీకి స్వాగతం..
ఇక, నేరపూరితమైన కోట్టాలో భాగంగానే ఫైల్స్ ను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. లాప్ టాప్, డెస్క్ టాప్లో ఉన్న సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేసిన ప్రణీత్ రావు.. ఎస్ఓటీ లాగర్ రూం కరెంటు సప్లై నిలిపి వేసి ఫైలు, సాప్ట్ వేర్ ని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఎస్ఓటి చేపట్టిన ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆయన నాశనం చేసిట్లు తెలిపింది. కుట్రలో భాగంగానే సమాచారం మొత్తం ధ్వంసం చేసినట్లు గుర్తించిన పోలీస్ శాఖ.. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పోలీసు శాఖ రంగం సిద్ధం చేసుకుంది.