Leading News Portal in Telugu

MP K.Laxman : దేశంలో ఎక్కడికి వెళ్ళినా మోడీకి బ్రహ్మరథం పడుతున్నారు..



Laxman

దేశం లో ఎక్కడికి వెళ్ళినా మోడీ కి బ్రహ్మరథం పడుతున్నారని, అది చూసి కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నారన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే మోడీకి కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారని, కానీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులు అని మోడీ అనుకుంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా పేదలకు ఇళ్లు కట్టించిన ప్రధానికి సొంత ఇల్లు కూడా లేదని, రోజుకు 18 గంటలకు పైగా పని చేస్తున్న మోడీ నీ చూసి దేశ ప్రజలే ముగ్ధులు అవుతున్నారన్నారు. అసాధ్యం ఆన్న దాన్ని సుసాధ్యం చేసిన ఘనత మన ప్రధాని మోడీది అని ఆయన అన్నారు. అందుకే దేశం అంతా ఫిర్ ఏక్ భార్ మోడీ అని నినాదం చేస్తున్నారన్నారు. వంశ పారంపర్యంగా రాజకీయాలు చేస్తున్న వారు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.. సోనియా గాంధీ రాహుల్ ను ప్రధాని నీ చేయడానికి పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’కేసీఆర్ కొడుకునో కూతురునో ముఖ్యమంత్రి చేయడానికి పని చేస్తున్నాడు.. ఇలాగే తమిళనాడు తో పాటు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కుటుంబం కోసం పని చేస్తున్నాయి.. కానీ దేశ ప్రజల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది.. మోడీ మా కుటుంబ సభ్యుడు..మేము మోడీ కుటుంబం అని దేశ ప్రజలు చెప్పుకుంటున్నారు.. DMK నేత రాజా రాముడి గురించి కామెంట్స్ చేస్తున్నారు.. మన దేశం లో ఉంటూ మన దేశం తింటూ మన దేశాన్ని విమర్శిస్తున్నారు.. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ జిందాబాద్ అంటే దానిని తప్పించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్.. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో నిజం తేలిన తరువాత కూడా కాంగ్రెస్ ఈ విషయం పై అపందించడం లేదు.. ప్రజలను వంచించి అధికారం చేతబట్టిన రేవంత్ రెడ్డి.. గ్యారెంటీ ల పేరుతో తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నాడు..

 

మహాలక్ష్మి పధకం లో 2500 రూపాయలు ఇస్తా అని చెప్పారు..ఇంకా మొదలు కూడా పెట్టలేదు అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పి అధికారం లోకి వచ్చి ఇప్పుడు కొందరికే అని ఆంక్షలు పెడుతున్నారు.. గృహ జ్యోతి పధకం ద్వారా అందరికీ 200 యూనిట్ల విద్యుత్ బిల్లు ఉచితం అన్నారు.. ఇప్పుడు అధికారం వచ్చాక మాట మార్చి 200 లకి మించి ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా మొత్తం భారం ప్రజలపై వేస్తా అంటున్నారు.. 15 వేలు రైతు భరోసా ఇస్తా అన్నారు.. 12 వేలు కూలిలకు బరోసా ఇస్తా అన్నారు.. ఇప్పుడు రైతు బరోసా లేదు.. కూలీ భారోసాలేదు.. కేవలం ఎన్నికల ముందు నామ మాత్రంగా పదకాలు ప్రారంభిస్తున్నారు.. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఈ హామీలు ఉంటాయని నమ్మకం కూడా లేదు.. డిసెంబర్ లోనే రైతు బరోసా ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదు.. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా అమలు చేయలేని హామీలు కాంగ్రెస్ ఇచ్చింది.. ఇదిగో పులు అంటే అధిలో తోక అన్నట్లు కాంగ్రెస్ మంత్రి ప్రవర్తిస్తున్నారు.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పని చేస్తున్నారు.. వీరికి MIM సంధి చేస్తుంది.. ప్రజల్లో ఎక్కడ చూసినా మోడీ పేరే వినిపిస్తుంది.. అది చూసి ఈ రెండు పార్టీలు తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నాయి.. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలిచేది కూడా బిజెపి నే.. 12 వ తేదీన అమిత్ షా సభ ఉంటుంది.. ఆ సభలో బూత్ స్థాయి కమిటీ సమావేశం ఉంటుంది.. కొన్ని మీడియా సంస్థలు బిజెపి పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి..’ అని కోదండ రెడ్డి అన్నారు.