
సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ఖేడ్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను ఆపి మరీ రైతుబంధు ఇచ్చాడని, రేవంత్ మాత్రం ఏసీ రూముల్లో కూర్చోనోళ్లు ఫస్ట్…ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులు లాస్ట్ అంటున్నారన్నారు. అధికారానికి రెండు రోజుల ముందు…హామీలకు రెండేళ్లు వెనక ఉండే వ్యక్తి రేవంత్ అని హరీశ్ రావు మండిపడ్డారు. మోడీ బడే భాయ్, రేవంత్ చోటా భాయ్.
BC Janardhan Reddy: బీసీ జనార్థన్ రెడ్డి దాతృత్వం.. దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ..!
ఇద్దరూ ఒకటే అని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటే మోదీ ఆశీర్వాదం ఎందుకు కోరుకుంటున్నావు రేవంత్? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోడని నువ్వే చెప్పకనే చెప్పావని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని, జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అమరుల స్తూపం దగ్గర రెండు పువ్వులు కూడా పెట్టని రేవంత్‌కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుంది? అని ఆయన అన్నారు. ఢిల్లీలో గల్లిలో ఏ పార్టీ ఉన్నా…. తెలంగాణ కోసం పోరాడే వారినే ఎంపీగా గెలిపించాలని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మరో రెండు నెలల్లో దిగిపోయే ప్రధాని ఆశీస్సులను రేవంత్ ఎందుకు కోరుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు.
MP Vijay Sai Reddy: ఏపీ అభివృద్ధిలో వెనుక పడిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు..