Leading News Portal in Telugu

NDSA Committee: అన్నారం సరస్వతి బ్యారేజీకి ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల బృందం



Ndsa

NDSA Committee: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజీకి నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(NDSA0 నిపుణుల బృందం చేరుకుంది. నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ బృందం రెండో రోజు పర్యటిస్తోంది. నిన్న రాత్రి రామగుండంలో బస చేసి అన్నారం బ్యారేజీకి చేరుకుని అక్కడ సీపేజీలు, బుంగలు, లీకేజీల ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. కేంద్రజలసంఘం మాజీ చైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు యు. సి. విద్యార్థి, ఆర్. పాటేల్, సీడబ్ల్యూసీ సభ్యుడు యస్.హెచ్.శివ కుమార్, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాలు ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు‌. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సభ్యులు బ్యారేజ్‌పై నుంచి పరిశీలిస్తున్నారు‌. మీడియాను అనుమతించడం లేదు. గురువారం ఈ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సంగతి తెలిసిందే.

Read Also: Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్‌కు12 వేల కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చా..