Leading News Portal in Telugu

Etela Rajender : ఈటల రాజేందర్ అనేటోడు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదు



Etela Rajendar

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ స్పందించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని మల్కాజిగిరికి ఈటల రాజేందర్ కు సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు. ఈటల రాజేందర్ అనేటోడు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టిబిడ్డగా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డను అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరి మీద పడితే వారి మీద, ఏది పడితే అదే… చప్పట్లు కొట్టగానే రెచ్చిపోయి మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. కానీ ముందుంది ముసళ్ళ పండగ అని ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ రాష్ట్రంలో తొలి ఆర్థికమంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నాం. ఈనాడు ఈ రాష్ట్ర ఆర్థికస్థితి ఏముందో, ఏం కాగలదో చెప్పగలిగే సత్తా నాకుంది.

  YSRCP: ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా వచ్చినా సీఎం జగన్ యుద్ధానికి ‘సిద్ధం’..

కానీ మూడు నెలలకే ఎవరి మీద విమర్శ చేయకూడదు కాబట్టి చేయడంలేదు. నా మొత్తం రాజకీయ జీవితంలో ఏ నాయకుడి మీదగానీ, ఏ పార్టీ మీదగానీ వ్యక్తిగతమైన దూషణలు చేయలేదు. నేను సంస్కారం ఉన్నవాడిని అని ఈటల రాజేందర్‌ అన్నారు. ఏ పొలిటికల్ లీడర్ చాలా ఎవాల్వై ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాడని, పొలిటికల్ లీడర్ సంకుచితవాది, డైరెక్షన్ లేని వాళ్ళు అయితే వ్యవస్థ కూలిపోద్ది అని నమ్మే వాడిని నేను అని ఆయన అన్నారు. అలాంటి చిన్న, కురుస నాయకులు గురించి నేను మాట్లాడనని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నోడికి తెలవదు, విన్న మనకు కూడా తెలుసుకునే ఆస్కారం లేకుండా పోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలై మా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.