Leading News Portal in Telugu

MLC Jeevan Reddy : కొన్ని మీడియా సంస్థలు కావాలని విమర్శనాత్మకంగా చిత్రీకరించాయి…



Mlc Jeevan Reddy

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ కష్టాలు ఏర్పడుతున్నాయని కొన్ని మీడియా సంస్థలలో రావడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని విమర్శనాత్మకంగా చిత్రీకరించాయని ఆయన మండిపడ్డారు. నిన్న జగిత్యాలలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం గురించి రెవెన్యూ అధికారులు విద్యుత్ శాఖకు తెలుపకపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, ప్రతి రెండవ శనివారం రోజున చేపట్టే మరమ్మత్తులకై అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారన్నారు. అధికారులు సమన్వయ లోపంతో ఏర్పడ్డ అంతరాయాన్ని విద్యుత్ కొరతగా సృష్టించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎదురవుతున్న కరెంటు కష్టాలని కొన్ని టీవీ పత్రికల్లో రావడం ఆశ్చర్యకరమన్నారు జీవన్‌ రెడ్డి. గత సంవత్సరంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన రెండు నెలల్లో ఎక్కువ మొత్తంలో వినియోగదారులు విద్యుత్తువినియోగించుకున్నారని, గత ప్రభుత్వ పాలన కన్నా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంతోపాటు గృహ అవసరాలకు ఇలాంటి అంతరాయాలు లేకుండా మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో వినియోగదారులకు అండగా నిలవడంతో కావాలనే టీఆర్ఎస్ నాయకులు అనుబంధిత మీడియా సంస్థ కావాలనే విమర్శలు చేస్తున్నాయని లేఖలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.