
Indiramma Houses: తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో ప్రకటించింది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. కాగా… ఆర్థిక సహాయం పంపిణీకి గ్రామ, మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేసిన అనంతరం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలల్లో జరిగే గ్రామ, వార్డు సభల్లో ప్రకటిస్తామని పేర్కొంది. కాంగ్రెస్ ఆరు హామీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 4 లక్షల 50 వేల ఇళ్లను సొంత భూమి ఉన్న వారికి 100 శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. అంతేకాకుండా.. ప్రభుత్వ పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అయితే.. ఈ పథకాన్ని సోమవారం బూర్గంపాడులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
Read also: Traffic Restrictions: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
గైడ్లైన్స్ ఇవే..
* రేషన్ కార్డు ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు అర్హులు.
* మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
* లబ్ధిదారుడు గ్రామం లేదా పట్టణ స్థానిక సంస్థ నివాసి అయి ఉండాలి. అద్దెదారులు అర్హులు.
* లబ్ధిదారుల ఎంపికను జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఖరారు చేస్తారు. గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా ఎంపిక ఉంటుంది.
* 400 ఎస్‌ఎఫ్‌టీల విస్తీర్ణంలో ఆర్‌సీసీ తరహాలో ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది.
* లబ్ధిదారుల ఎంపిక అనంతరం గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సమావేశంలో జాబితా ప్రవేశపెడతారు.
* జిల్లా ఇన్చార్జి మంత్రిని సంప్రదించి.. ఆ మంత్రి ఆమోదంతో కలెక్టర్ తుది జాబితాను ఖరారు చేస్తారు.
Read also: Delhi Encounter: ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్!
ఆర్థిక సహాయం నాలుగు దశల్లో
* బేస్‌మెంట్ స్థాయికి 1 లక్ష
* స్లాబ్ స్థాయికి 1 లక్ష
* స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షలు
* ఇల్లు పూర్తయిన తర్వాత 1 లక్ష. జిల్లా కలెక్టర్లు, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమోదించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండి నిధులు విడుదల చేయబడతాయి. ఆధార్ చెల్లింపు బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెల్లించబడుతుంది.
Mallikarjun Kharge: లోకసభ ఎన్నికలకు ఏఐసీసీ చీఫ్ దూరం?.. కారణం ఇదే..!