Leading News Portal in Telugu

TSRTC: నేడు 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. మహిళలకు ఫ్రీ జర్నీ..!



22 New Electric Buses Launched In Telangana

TSRTC: మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించి లక్షలాది మంది మహిళా ప్రయాణికులు నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల ఏర్పాటుకు టీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ నగరంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 22 కొత్త బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించనున్నారు.

Read also:Kishan Reddy: జాతీయ బడ్జెట్ లో కేంద్రం రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది..!

మొత్తం 500 బస్సులు అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నట్లు, అవి ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇవి పూర్తిగా నాన్ ఏసీ బస్సులు. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఈ బస్సులను తీసుకొస్తున్నట్లు గ్రేటర్ అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో కూడా మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలకు నడపనున్నారు. బిహెచ్‌ఇఎల్‌, మియాపూర్‌, కంటోన్‌మెంట్‌, హెచ్‌సియు, రాణిగంజ్‌ డిపోల వద్ద బస్సులను ఛార్జ్‌ చేసేందుకు 33 కెవి విద్యుత్‌ లైన్లు తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ ప్రత్యేకంగా 565 డీజిల్ బస్సులను అందజేస్తోంది. 125 మెట్రో డీలక్స్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. జూన్‌లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌, 140 ఆర్డినరీ బస్సులు. ఈ బస్సులన్నింటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి, ఇందులో పురుషులతో పాటు మహిళలకు కూడా సీట్లు దొరుకుతాయని తెలిపారు. అంతేకాకుండా.. మహిళలకు ఫ్రీ జర్నీతో పురుషులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమమంలో.. ఇందులో పురుషులకు కూడా సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
Houthi Rebels: హౌతీ రెబల్స్పై అమెరికా, యూకే స్ట్రైక్స్.. 11 మంది మృతి