Leading News Portal in Telugu

Ponguleti Srinivas Reddy: తెల్ల రేషన్ కార్డుల జారీకి కేబినెట్ అనుమతి..



Telangana Cabinet Meeting

తెలంగాణ కేబినెట్ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పైరవీలకు తావులేకుండా రేషన్ కార్డులను అర్హులైన పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందిని పేర్కొన్నారు. మరోవైపు.. ప్రజారాజ్యం, ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొన్ని అమలు చేస్తున్నామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇండ్లు, సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇస్తామని తెలిపారు. మొదటి విడత 4లక్షల 50వేల ఇండ్లు.. 22వేల 500 కోట్లకు ఆమోదం తెలిపింది.

Congress: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. కమల్‌నాథ్‌కు ఉపశమనం

ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఓఆర్‌ఆర్‌ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించనుంది. 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. మరోవైపు.. కాళేశ్వరం పై జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ చంద్ర ఘోష్ నియమించామని తెలిపారు. విచారణ వంద రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల దర్యాప్తు కోసం ఎల్. నరసింహరెడ్డిని నియమించామని పేర్కొన్నారు. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోళ్ళ పై కూడా విచారణ చేసి వంద రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. రైతుబంధు 84 శాతం మందికి ఇచ్చాము.. రాబోయే రెండు మూడు రోజుల్లో 93 శాతం మందికి రైతు బంధు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.

Shreyas Iyer: బీసీసీఐ దెబ్బకు తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన శ్రేయస్ అయ్యర్…!