Leading News Portal in Telugu

Bhatti Vikramarka: యాదగిరిగుట్టలో నాకేం అవమానం జరగలేదు.. భట్టి రియాక్షన్ ఇదే..!



Bhatti

సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాలు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.. అయితే, పూజలో కూర్చున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పెద్ద పీటలపై కూర్చోగా… డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిన్న పీటపై కూర్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. దళిత నేతకు దేవుడి సమక్షంలో తీవ్ర అవమానం జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఈ అంశంపై భట్టి విక్రమార్క స్పందించారు.

యాదగిరిగుట్టలో నాకేం అవమానం జరగలేదు.. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అంత సంకుచిత భావం ఉన్న వాళ్ళు కాదు అని అన్నారు. నిన్న(సోమవారం) నేను పేదలకు ఇండ్లు ఇస్తున్న అనే సంతోషంలో ఉన్నా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూసి.. సీఎం మాట్లాడారని తెలిపారు. కావాలనే తాను చిన్న పీట మీద కూర్చున్నానని చెప్పారు. భక్తి భావంతో అలా కూర్చున్నా.. తనకు ఆత్మభిమానం ఎక్కువ అని అన్నారు. నా ఆత్మభిమానంకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదని భట్టి విక్కమార్క చెప్పారు. తనను ఎవరూ అవమానించలేదని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.

మరోవైపు.. యాదగిరిగుట్టలో ఏర్పాట్లన్నీ తానే చూశానని భట్టి విక్రమార్క తెలిపారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగులకు డీఏ కూడా ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చూపుతున్నామన్నారు. పరిపాలన చేసిన అనుభవం ఉన్న కేసీఆర్.. తమపై ఎలా పడితే అలా మాట్లాడొద్దని సూచించారు. మాట్లాడాడు అంటే దుర్భుద్ధితో మాట్లాడిన మాటలు అని ఆరోపించారు.