Leading News Portal in Telugu

Amit Shah: బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అజెండా ఒక్కటే..



Amit Sha

బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. సోషల్ మీడియాతో ప్రతి ఇంటికి మన సందేశం వెళ్ళాలి.. దేశ ప్రజలు మూడోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని పేర్కొన్నారు. రైతులు, పేదలు.. ఎవరి దగ్గరికి వెళ్లినా మోడీ మోడీ అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి.. కానీ మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అమిత్ షా పేర్కొన్నారు.

Viral News: అసలు ఎలా వస్తాయో ఇలాంటి ఆలోచనలు.. కార్ వైపర్స్ పని చేయకపోవడంతో ఆ మహిళ ఏం చేసిందంటే..?

దివ్యమైన రామ మందిరం నిర్మాణం చేసుకున్నాం.. కాశ్మీర్లో 370 రద్దు చేసుకున్నాం.. ట్రిపుల్ తలాక్ తెచ్చాం.. లక్షల మంది ముస్లిం తల్లుల బాధ అర్థం చేసుకుని త్రిపుల్ తలాక్ తెచ్చాం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చాం.. ఇప్పుడు CAA తెచ్చామని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ CAAకు వ్యతిరేకం.. కాంగ్రెస్ కి నాగరికత లేదని విమర్శించారు. కాంగ్రెస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు అని మండిపడ్డారు. పదేళ్ళలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది మోడీ సర్కార్ అని అమిత్ షా తెలిపారు.

AP DSC New Schedule 2024: డీఎస్సీ-2024 షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే..

బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అజెండా ఒక్కటేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మూడు పార్టీల జెండాలు వేరు.. అజెండా ఒక్కటేనని ఆరోపించారు. ముస్లిం రిసేర్వేషన్ లు ఎత్తివేస్తాం.. కాంగ్రెస్ ఎత్తేయగలుగుతుందా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అన్నారు. దాని చిట్టా అంతా తమ దగ్గర ఉందని.. తెలంగాణ వికసిత్ అజెండా లేదు వల్ల దగ్గర అని ఆరోపించారు. ఉమ్మడి ఏపీకి సోనియా, మన్మోహన్ సింగ్ లు పదేళ్ళలో 2 లక్షల కోట్లు ఇచ్చారు.. మోడీ 12 లక్షల కోట్లు వెచ్చించారు తెలంగాణకు అని తెలిపారు.