Leading News Portal in Telugu

TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్



Ts Cabinet

సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రేపోమాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్‌ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా.. మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థిక సహాయంపై చర్చించే అవకాశముంది.

Read Also: Summer Heat: తెలంగాణలో భానుడి భగభగలు.. మార్చిలోనే మండే ఎండ

అంతేకాకుండా.. కేబినెట్ భేటీలో గవర్నర్ కోటా ఎమ్మె్ల్సీలను ఖరారుచేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది. 2008 డీఎస్సీ అభ్యర్థులకు కూడా మంత్రి వర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశముంది. మరోవైపు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదంపై చర్చించనుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటనపై సైతం మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది.

Read Also: Rajasthan: హాస్టల్ దగ్గర కూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. పైలట్ సేఫ్