Leading News Portal in Telugu

Group-1 Exam: రేపటితో ముగియనున్న గ్రూప్‌-1 దరఖాస్తు గడువు



Group 1

Group-1 Exam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 563 పోస్టుల భర్తీ ఈ ప్రకటన జారీ కాగా.. మార్చి 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. గ్రూప్‌ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల దరఖాస్తులు వచ్చాయి. రేపు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.

గతంలో అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు ఫీజు చెల్లించిన కారణంగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Read Also: Temperature: నిప్పుల కొలిమిగా నంద్యాల.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

how to apply TS Group 1: ఇలా దరఖాస్తు చేసుకోండి….
*గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లోకి వెళ్లాలి.

*ఓటీఆర్ లేని వారు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్(New Registration OTR) ఉన్నవారికి అవసరం లేదు.

*గ్రూప్ 1 ఆన్ లైన్ దరఖాస్తుల ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*మీ ఓటీఆర్ వివరాలతో లాగిన్ కావాలి.

*మీ వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.

*ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుం చెల్లించాలి.

*సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.