Leading News Portal in Telugu

Telangana: అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు



Govt School

Telangana: అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాల సేవల్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అమలు చేయడం, పర్యవేక్షించడం, బలోపేతం చేయడం, నిర్వహించడం, విద్యార్థులకు పాఠశాల యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటివి అందజేయడంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులను చూసుకోవడం అంతా ఇక అమ్మ ఆదర్శ కమిటీలదే.

అమ్మ ఆదర్శ కమిటీల బాధ్యతలు

1) ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం:

2) బాలికల మరుగుదొడ్ల నిర్మాణం.

3) తాగునీటి సౌకర్యాలు కల్పించడం.

4) చిన్న, పెద్ద మరమ్మతు పనులను చేపట్టడం.

5) ఇప్పటికే ఉన్న & పనిచేయని టాయిలెట్ల పునరుద్ధరణ, నిర్వహణ.

6) తరగతి గదుల విద్యుద్దీకరణ.

7) పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం & నిర్వహణ.

8) విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు.

9) పాఠశాల మొత్తం నిర్వహణ.

10) యూనిఫాంలను కుట్టడం.

అమ్మ ఆదర్శ పాటశాల కమిటీలు పాఠశాల స్థాయిలో మహిళ ఎస్‌హెచ్‌జీ సభ్యుల నుంచి ఏర్పాటు చేయబడతాయి. గ్రామ సంస్థ/ఏరియా స్థాయి సమాఖ్య అధ్యక్షులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అధ్యక్షుడిగా ఉంటారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. ఇకపై ప్రభుత్వ స్కూల్స్ నిర్వహణ బాధ్యత మహిళ స్వయం సహాయక సంఘాలదే.

 

School