
Weather Warning: వేసవి ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత భానుడు భగభగ మండుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో.. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మార్చిలోనే రికార్డు స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అయితే.. మార్చి చివరి నాటికి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజాగా.. మధ్యాహ్నం నుంచి భారీ వడగళ్ల వాన కురుస్తోంది.
Read also: Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!
రహదారుల వద్ద సిగ్నల్స్ వద్ద వాహనదారులు నరకయాతన పడుతున్నారు. తాజాగా.. ఎండలో నడిచే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండకు గురికావడం వల్ల పొడిబారడం, ఎరుపుదనం, తలనొప్పి, దురద, వాంతులు మరియు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. బీపీ, షుగర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఓఆర్ ఎస్ ద్రావణం లేదా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తీసుకుంటే… చెమట రూపంలో పోగొట్టుకున్న లవణాలు తిరిగి శరీరానికి అందుతాయి. రోజూ సూర్యోదయానికి ముందు వ్యాయామం చేయడం మంచిదన్న సంగతి తెలిసిందే.. మాంసాహారం ఎక్కువగా తింటే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
North Korea: యుద్ధానికి సిద్ధం.. కమాండర్లతో నార్త్ కొరియా అధ్యక్షుడు భేటీ..?