Leading News Portal in Telugu

MLC Kavitha: కవిత అరెస్ట్.. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం



Ktr

కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కవిత ఇంటికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. సుప్రీంకోర్టులో అండర్‌టేకింగ్‌ ఇచ్చి ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించిన కేటీఆర్.. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా ఈడీ చర్యలు సరికాదన్నారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారులు కేటీఆర్ ను సముదాయించే ప్రయత్నం చేశారు.