Leading News Portal in Telugu

Kavitha: ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటాం.. పార్టీ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలి



Kavitha 2

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారికంగా ప్రకటించింది. సెక్షన్ 19, Pmla act కింద ఈడీ అరెస్ట్ చేశారు. కవిత నివాసం నుంచి మూడు వాహనాల్లో కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. దుర్గంచెరువు మీదుగా శంషాబాద్ కి ఈడీ తీసుకెళ్తున్నారు. అంతకుముందు కవిత ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కార్యకర్తలకు, అభిమానులకు నినాదాలు చేశారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటామని కవిత తెలిపారు. పార్టీ శ్రేణులు బలంగా మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. అక్కడున్న కార్యకర్తలంతా మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కవితను కారులో తీసుకెళ్తుండగా పలువురు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 8.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. ఢిల్లీకి తరలించేందుకు సాయంత్రమే ఫ్లైట్ టికెట్లను బుక్ చేశారు. ఈ రాత్రికి కవిత ఈడీ అదుపులోనే ఉంటారు. మనీలాండరింగ్ యాక్ట్ కింద ఆమెను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

Bode Prasad: చంద్రబాబుతో ముగిసిన భేటీ.. వెనక్కి తగ్గని బోడే ప్రసాద్..

కవిత అరెస్ట్ అంశంపై ఈడీ స్పందించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు చేసినట్లు తెలిపింది. మనీ లాండరింగ్ హవాలా చట్టం కింద కవితను అరెస్టు చేశామని పేర్కొంది. సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాలకు కవితను అరెస్టు చేశాం.. కవిత అరెస్ట్ సమాచారాన్ని భర్త అనిల్ కి చెప్పామని ఈడీ తెలిపింది. 14 పేజీలతో కూడిన అరెస్టు సమాచారాన్ని కవిత భర్తకు ఇచ్చామని పేర్కొంది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర నేతృత్వంలో కవితను అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.