
సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. మొన్నటివరకు వెల్లుల్లి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవలే కొంచెం తగ్గినట్లు తగ్గి మళ్లీ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి..ప్రస్తుతం భారత దేశంలో టమోటా సంక్షోభం ను ఎదుర్కొంటుంది.. గతంలో రెండు, మూడు రూపాయలు ఉన్న టమోటా ధర ఇప్పుడు పరుగులు పెడుతుంది..
గతంలో అధిక వర్షాల కారణంగా ధరలు పెరిగితే, ఇప్పుడు పంటకు సరిగ్గా నీరు లేకపోవడం తో ధరలు పెరిగినట్లు తెలుస్తుంది.. గత వారం రోజుల క్రితం రూ.18 నుంచి రూ.25 రూపాయలు పలుకుతున్న కిలో ధర ఇప్పుడు అమాంతం పెరిగాయి.. నీరు సరిగ్గా లేని సందర్బంలో కూడా ఇలా తక్కువ ధరలకు అమ్మితే నష్టం వస్తుందని రైతులు భావిస్తున్నారు… దీంతో ఇప్పుడు ధరలను పెంచుతున్నట్లు చెబుతున్నారు..
ప్రస్తుతం పాలకోడ్ టమోటా మార్కెట్లో 8 టన్నులకు పైగా టమోటాలు వస్తున్నాయి. సాధారణంగా ఈ నెలలో 20 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. పీక్ సీజన్లో 700 నుంచి 800 టన్నుల దిగుబడి వస్తుంది. ఇప్పుడు 20 టన్నులు మాత్రమే వస్తున్నాయి. సరఫరా తక్కువగా ఉన్నప్పటికీ ధరలు అంత ఎక్కువగా లేవు. 35 కిలోల బాక్సు రూ.250 నుంచి రూ.350 వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు..