Leading News Portal in Telugu

Civil Supplies Department: ధాన్యం తాజా టెండ‌ర్లతో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ.1,110.51 కోట్ల లాభం..



Civil Department

ఏడాది క్రితం అకాల వ‌ర్షాల‌తో త‌డిచిన ధాన్యం విక్రయాల్లో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ.వెయ్యి కోట్లకుపైగా న‌ష్టం వాటిల్లేలా గ‌త ప్రభుత్వం ప్రయ‌త్నించింది. మెట్రిక్ ట‌న్నుకు రూ.3 వేల‌కుపైగా త‌క్కువ‌కు టెండ‌ర్ క‌ట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టప‌డ‌లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ఆ టెండ‌ర్లను ర‌ద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండ‌ర్లలో గ‌తం క‌న్నా ఒక్కో మెట్రిక్ ట‌న్నుకు రూ.3 వేలు అద‌నంగా టెండ‌ర్లు దాఖ‌ల‌య్యాయి. ఈ లెక్కన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ.1,110.51 కోట్లు అద‌నంగా స‌మ‌కూర‌నుంది.

Tej Pratap Yadav: బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి చేరిక

క‌నీస మ‌ద్దతు ధ‌ర (ఎమ్మెస్పీ) ప్రకారం మెట్రిక్ ట‌న్ను ధాన్యం ధ‌ర రూ.20,600. గ‌త ప్రభుత్వ హ‌యాంలో టెండ‌ర్లు పిలిచి మెట్రిక్ ట‌న్నుకు రూ.17,015.19కు టెండ‌ర్లు ఖ‌రారు చేశారు. ఆ లెక్కన 34.59 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ.5,885.55 కోట్లు రావ‌ల్సి ఉంది. ఎమ్మెస్పీ ప్రకారం చూస్తే రూ.1,239.99 కోట్లు శాఖ న‌ష్టపోయే ప‌రిస్థితి. అంత త‌క్కువ‌కే టెండ‌ర్లు ద‌క్కించుకున్న కొనుగోలుదారులు ఆ మొత్తం చెల్లించేందుకూ ముందుకు రాలేదు.

Komatireddy Venkat Reddy: కవిత ఇంట్లో ఐటీ సోదాలు.. మంత్రి హాట్ కామెంట్స్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత పాత టెండ‌ర్లు ర‌ద్దు చేసి మ‌ళ్లీ టెండ‌ర్లు పిలిచారు. తాజా.. టెండ‌ర్లలో మెట్రిక్ ట‌న్నుకు రూ.20,225.67కు టెండ‌ర్ దాఖ‌లైంది. పాత టెండ‌ర్‌తో పోలిస్తే ఇది ఒక్కో మెట్రిక్ ట‌న్నుకు రూ.3,210.48 అద‌నం. ఈ లెక్కన మొత్తం 34.59 లక్షల మెట్రిక్ ట‌న్నుల‌కు తాజా టెండ‌ర్ ప్రకారం రూ.6,996.06 కోట్లు రాబ‌డి స‌మ‌కూర‌నుంది. పాత టెండ‌ర్ల రాబ‌డితో పోలిస్తే ఇది రూ.1,110.51 కోట్లు అద‌నం.