Leading News Portal in Telugu

TS Elections 2024: తెలంగాణలో మే 13న ఎన్నికలు..



Rajiv Kumar

ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Read Also: Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19 నుంచి లోక్ సభ ఎన్నికలు మొదలు.. 7 విడతలుగా ఎలక్షన్స్..

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ లో.. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి.

Read Also: AP Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో ఎన్నికలు ఆ తేదీనే

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అందులో పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు అని వివరించారు. ఈసారి 1.85 కోట్ల మంది యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబుతున్నారని రాజీవ్ కుమార్ వెల్లడించారు. 48 వేల మంది ట్రాన్స్ జెండర్లు, 88.4 లక్షల మంది దివ్యాంగులు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారని వివరించారు. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు.