Leading News Portal in Telugu

MP K.Laxman : ఇల్లు లేని పేదలకు నాలుగు కోట్ల ఇళ్లు కట్టించాం



Dr K Laxman

ముషీరాబాద్ అసెంబ్లీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పర్యటించారు. ఈ సందర్భంగా “లబ్ధిదారుల సమవృద్ది – మోడీ గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీ నగర్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి దారులను ఇంటింటికీ వెళ్లి కలుస్తూ ‘మోడీ గ్యారెంటీ’ గురించి వివరించారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలతో పాటు పలు సంక్షేమ పథకాలు అందించిందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, యువత మరియు పేద వర్గాల అందరి కోసం పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని, ఆ పథకాల ద్వారా లబ్ది పొందిన కోట్లాది మంది ప్రజలు ఈ దేశం లో ఉన్నారన్నారు. వారందరినీ ఈ ఎన్నికల దృష్ట్యా ప్రత్యక్షంగా కలిసి ఈ పథకాల ద్వారా వారి జీవన సరళిలో ఏ మేరకు మార్పు వచ్చిందని, ఏ రకంగా వారు శ్వశక్తులు అయ్యారో తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ లో ప్రారంభించడం జరిగిందని ఎంపీ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’దాదాపు 20 కి పైగా లబ్ధి దారులను నేరుగా కలిసాము.. ఉజ్వల గ్యాస్ పథకంలో ఉచితంగా గ్యాస్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు.. వ్యవసాయం చేసే వారికి ప్రతీ ఏటా మూడు విడతలుగా ఆర్థిక సహాయం వస్తుంది.. దేశ వ్యాప్తంగా దాదాపు 54 లక్షల వీధి వ్యాపారులు చేసే వారికి ఆర్థిక సహాయం చేసి కాబులి వాళ్ల వడ్డీ బెడద లేకుండా చేశాము.. మొదటి విడుతగా పదివేలు, రెండో విదూతగా ఇరవై వేలు, మూడో విడతగా యాభై వేలు నామ మాత్రపు వడ్డీతో అందించాం.. ఇల్లు లేని పేదలకు నాలుగు కోట్ల ఇళ్లు కట్టించాము.. 12 కోట్ల మందికి టాయిలెట్స్ కట్టించాం.. పది కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం.. దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కుల వృత్తులకు ఆధునిక శిక్షణ మరియు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతుంది.. మత్స్యకారుల కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనతో 50 శాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం ఇస్తున్నాము.. ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది.. మిగతా పార్టీల మాదిరిగా ఊచితాలు గ్యారెంటీ అని చెప్పకుండా.. వారికి వనరులు కల్పించి స్వంతగా వ్యాపారాలు చేసి సంపాదించే అవకాశం కల్పించాము.. దేశ వ్యాప్తంగా ఇచ్చిన ముద్రా లోన్లల్లో 70 శాతం మహిళలకు ఇచ్చాము.. మహిళలకు కూడా అన్ని రంగాల్లో పెద్ద పీట వేశారు మన మోడీ గారు.. ప్రపంచంలో కేవలం 5 శాతం మహిళా పైలెట్లు ఉంటే.. మన దేశంలో 17 శాతం మహిళా పైలెట్స్ ఉన్నారు..

యుద్ద విమానాల నడిపించే స్థాయికి మన దేశ మహిళలు ఎదిగారు అంటే అది మోడీ కల్పించిన మహిళా సాధికారతే కారణం.. ఈ లబ్ది దారులను నేరుగా కలిసి వారిని మోడీ సహకరిచమని అడిగే కార్యక్రమం ఇక్కడ ప్రారంభించాము.. ఈ కార్యక్రమంలో భాగంగా రాంనగర్, గాంధీ నగర్, కవాడిగూడా డివిజన్లలో లబ్ధి దారులు మోడీకి ధన్యవాదాలు తెలిపారు.. ఏమంతా మోడీ కుటుంబ సభ్యులమే అంటూ వారు ప్రకటిస్తున్నారు.. విపక్ష నేతలు మోడీ కి కుటుంబం లేదంటుంటే.. దేశ ప్రజలంతా మేము మోడీ కుటుంబం అని ముందుకు వస్తున్నారు.. 85 శాతం ప్రజానికానికి ప్రభుత్వం లో భాగస్వామ్యం లేదని వారికి మేలు జరగటం లేదని అంటున్నారు.. 60 సంవత్సారాలు దేశాన్ని పాలించిన మీరా దానికి బాధ్యులు.. రాహుల్ గాంధీ గారూ ఏ శాతం లో ఉంటారో వారే నిర్ణయించుకోవాలి.. 85 శాతంలో వచ్చే వర్గాల నుండి మోడీ గారు మొదటి ప్రధాని అయ్యారు.. ఇవ్వాళ ఆది వాసి మహిళను రాష్ట్రపతి చేశారు.. మహిళకు మరుగుదొడ్లు నిర్మించారు.. నేటి బచావో కార్యక్రమంలో పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.. ఈ రకంగా మోడీ పని చేస్తుంటే రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారు.. గత పదేళ్ళలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి మోడీ చేశారు..’ అని ఎంపీ లక్ష్మణ్‌ వివరించారు.