
బీఆర్‌ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నెయ్యి అనె చందoలాగా ఉన్నాయని, గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి రూ.10,000 పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. తదనంతరం 350 కోట్లకి ఉతర్వూలు జారీచేసి పరిహారం అందించిన పాపాన పోలేదు అదే విధంగా అదే నెలలో మరియొక్క మారు 1,25,000 ఎకరాల పంట నష్టం సంభవించిన పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా 100 కు 100 శాతం పంటలు నష్టపోయి ఇసుక మేటలు వేసిన సందర్భములో అప్పటి ప్రభుత్వంలోని నాయకులు ఏ ఒక్కరూ పట్టించుకోలేదని, రుణ మాఫీ అమలు చేస్తామని గొప్పగా చెప్పుకున్న B.R.S నాయకులు మొదటి విడత మాఫీని నాలుగు విడతలగా ఇవ్వడంతో ఆ మొత్తం అసలుకు బదులు వడ్డీ జమైన సందర్భము ప్రతి ఒక్క రైతుకి అనుభవమేనన్నారు.
అంతేకాకుండా.. ‘2018 లో ప్రకటించిన రెండవ విడత రుణమాఫీ 19,600 కోట్లకు గాను కేవలం 9500 కోట్లు విడుదల చేసి మమ అనిపించారు ఆ నాయకులు ఈ రోజు ముసలి కన్నీళ్ళు పెడుతున్నారు. రైతు బంధు విషయంలో మే నెల వరకు రైతులకు గతంలో జమ చేసిన సందర్బాలు మర్చిపోయి ఇప్పుడు మార్చ్ నెల లోనే పథకము అమలు చేయలేదని గగ్గోలు పెడ్తున్న B.R.S నాయకులు ఈ ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రశ్నించే అధికారము లేదు. గత ప్రభుత్వ పాపాల వాళ్ళ ఖాలీ అయిన ప్రభూత్వ ఖజనాని క్రమశిక్షణతో ప్రభుత్వాని నడుపుతూ జమ అవుతున్న నిధుల నుంచి అధిక భాగము రైతు బందుకి వేచ్చిస్తున్నము.
గతంలో అధికారంలో ఉండగా ఏనాడూ రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం గొప్పలకి పోయి నీళ్ళు అవసరంలేని సందర్భాలలో కూడా కాలువలకు నీళ్ళు విడుదల చేసి నీరు వృధా చేయడం జరిగింది. నాగార్జున సాగర్ మొదటి పంటకే నీళ్ళు ఇవ్వని దుస్థితికి తెచ్చారు. విద్యుత్ ఉత్పత్తిని ప్రణాళిక ప్రకారం చేయకుండా నీటిని విడుదల చేసి సముద్రంలో కలిపి నాగార్జున రిజర్వాయర్ ను ఖాలీ చేసిన పాపం అప్పటి ప్రభుత్వానిదే. కాంగ్రెస్ ఎప్పటికీ రైతుల పక్షపాత ప్రభుత్వమే. గత రెండు మూడు రోజుల కురిసిన వర్షo వల్ల జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యి వారికి దృష్టికి తీసుకు వెళ్లారు.
అదేవిధంగా ఈ ప్రభుత్వము రైతులను కష్టకాలoలో ఆదుకునేందుకు ఎప్పుడు సిద్దంగా ఉంటుందని ఎన్నికల కోసం లేదా రాజకీయాల కోసం ఉత్తుత్తి మాటలు ఉత్తుత్తి పథకాలు ప్రకటించదని, అప్పటి ప్రభుత్వం పనిచేసిన మాజీ మంత్రులు తెలుసుకోని ప్రేలాపనలు మనుకోవల్సిందిగా మంత్రి సూచించారు. అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారికి, పంట నష్టం పై రేపటి నుండే రైతువారి సర్వే చేసి నివేదిక సమర్పించవల్సిందిగా ఆదేశాలు జారీచేసారు. నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి ఆదేశానుసారం నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకోవడం జరుగుతుంది అని తెలియచేసారు.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.