Leading News Portal in Telugu

Madhapur DCP Vineeth : ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశాం



Dcp Vineeth

ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో A13 అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. అతని తో పాటు నరేందర్ అనే ఢిల్లీ కి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని, వీరి వద్ద నుండి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ వినీత్‌. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్ లో విక్రయిస్తున్నారని, హైదరబాద్ లో 15 మంది ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్నారన్నారు. పబ్బులకు వెళ్లే యూత్ ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారని, హైదరబాద్ తో పాటు గోవా, బెంగళూరు ముంబయి వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్నారు.

అంతేకాకుండా..’సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్పై నగరంలో అరు డ్రగ్ కేసులు నమోదు ఉన్నాయి. గచ్చిబౌలి, మలక్పేట్ , చాదర్ఘాట్, యాదగిరిగుట్ట పీఎస్ లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంత మైన కార్ల కొనుగోలుకు వెచ్చించాడు. రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెగ్లర్ అండర్లో పనిచేస్తాడు. డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు.. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఫైజాల్ ను పీటి వారింట్ పై హైదరాబాద్ కు తీసుకుని వస్తాం.. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రహమాన్తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ పబ్ కేసులో మీనన్ యువతికి రెహ్మాన్ డ్రగ్ సప్లయ్ చేశాడు. రాడీసన్ పబ్ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు పరారీలో ఉన్నారు.. కోర్టు నుండి అనుమతి వచ్చాక రాడిసన్ పబ్ కేసులో పట్టుబడిన వారికి మళ్లీ బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తాం. రెహమాన్ కు నైజీరియన్లతో కూడా సంబంధాలు ఉన్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బుతో కార్లు కొనుగోలు చేయడానికి నరేందర్ సహకరించేవాడు’ అని డీసీపీ పేర్కొన్నారు.