
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని.. స్వర్ణపుష్పార్చనలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాల ఆలయ అర్చకులు, అధికారుల అందజేశారు. అంతేకాకుండా.. స్వామి వారి చిత్రపటాన్ని గవర్నర్ కు బహుకరించారు సీఎస్‌శాంత కుమారి. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మాణం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వేల సంవత్సరాలు ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని, చాలాకాలంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకున్న… గవర్నర్ హోదాలో దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆనందంగా సుభిక్షంగా ఉండాలన్నారు గవర్నర్ రాధాకృష్ణన్.
Samantha Remuneration: వెబ్ సిరీస్ కోసం సమంత షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?