
Telagana Governor Radha Krishnan: తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సమస్యలపై రాధాకృష్ణన్ కు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది.
Read also: CPI Narayana: సీపీఐ నారాయణకు విరిగిన రిబ్ ఎముక.. రెండు వారాలపాటు రెస్ట్
ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొనసాగనున్నారు. రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీలో సీనియర్ నాయకుడు. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పలు కీలక పదవులు నిర్వహించారు. 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు వారు ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే.. బీజేపీ తరపున పలు కీలక పదవులు నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
Chef Mantra Promo: ఇది కిచెన్ షో లాగా లేదే..మరీ ఇంత డబుల్ మీనింగ్ ప్రశ్నలా..?