
Women Employment: ఇటీవల కాలంలో మహిళ ఉపాధి ధోరణలు పెరుగుతున్నాయి. ప్రతీ రంగంలో వారి ప్రాతినిధ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్‌లో వీరికి మంచి ఉపాధి లభిస్తోంది. ఇదిలా ఉంటే మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహిళా శ్రామిక శక్తికి భాగ్యనగరం గమ్యస్థానంగా నిలుస్తోంది. పూణే, చెన్నై నగరాలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరీర్‌నెట్ ద్వారా ‘ది స్టేట్ ఆఫ్ ఉమెన్స్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం, హైదరాబాద్ 34 శాతం హైరింగ్ రేటుతో తొలిస్థానంలో ఉంది. పూణే 33 శాతంతో, చెన్నై 29 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే మహిళా ఉపాధితో ఢిల్లీ నగరం క్షీణతను చూసింది. ఢిల్లీలో ఇది 20 శాతానికి పడిపోయింది. గతేడాది గణాంకాలతో చూస్తే 2 శాతం తగ్గింది. మొత్తం స్త్రీ జనాభాలో 37 శాతం అంటే దాదాపుగా 69.2 కోట్ల మంది ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు.
Read Also: Lok Sabha Elections 2024: ఏడు దశాబ్ధాల ఎన్నికల చరిత్రలో 14 నుంచి 6కి తగ్గిన జాతీయ పార్టీలు..
2023లో వర్క్ ఫోర్స్‌లో ముఖ్యంగా జూనియర్ ప్రొఫెషనల్ రోల్స్, ఎగ్జిక్యూటివ్ బోర్డులో అంతకుముందు ఏడాదితో పోలిస్తే మహిళా ప్రాతినిధ్య 2-5 శాతం పెరిగింది. కళశాల నుంచి వచ్చే ఫ్రెష్ టాలెంగ్ కలిగిన వారిలో 40 శాతం మహిళలే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. హైరింగ్ ట్రెండ్స్‌ని పరిశీలిస్తే 0-3 ఏళ్లు మరియు 3-7 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న మహిళలు 20-25 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2023లో ఇంటర్నల్ సోర్సెస్, ఎంప్లాయర్ కెరీర్ పోర్టల్స్, మంత్-టూ-మంత్ హైరింగ్ ట్రెండ్స్ పరిశీలించిన ఈ నివేదిక 25,000 ఉద్యోగ నియామకాలను విశ్లేషించింది. దీంతో మహిళకు ఉపాధి ధోరణులను అంచనా వేసింది.
తక్కువ వేతన వ్యత్యాసాన్ని నివేదిక హైలెట్ చేసింది. 2023లో 20 శాతానికి పే గ్యాప్ తగ్గిందని తెలిపింది. అంతకుముందు ఏడాది ఇది 30 శాతం ఉండేది. ఇది సమానవేతన విషయంలో సానుకూల మార్పును సూచిస్తోంది. కెరీర్‌నెట్ సీఈఓ అన్షుమాన్ దాస్ భారతదేశంలోని వైట్ కాలర్ ల్యాండ్‌స్కేప్‌లో గణనీయమైన లింగ అసమానతను నొక్కిచెప్పారు, ఇక్కడ గ్రామీణ జనాభాలో కేవలం 5 శాతం మాత్రమే వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ కేటగిరీలోకి వస్తారు, పట్టణ ప్రాంతాల్లో 30 శాతం మంది ఉన్నారు. వర్క్ ఫోర్స్‌లో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో పాధించిన పురోగతిని గుర్తిస్తూ..ఉపాధిలోకి మహిళలు ప్రవేశించేందుకు ఆటంకం కలిగించే సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని ఆయన చెప్పారు. భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో మహిళల ఉపాధి పెరుగుదలను కూడా ఆయన హైలైట్ చేశారు, ఇది భారతదేశ కార్పొరేట్ సంస్కృతిలో ఆశాజనకమైన పరివర్తనను సూచిస్తుంది.