
శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో కొంత కాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన పది మంది ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గుట్టపై కొంత కాలంగా అటవీ అభివృద్ధి పనులు చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారితో పాటు అతని సహాయకునిగా పనిచేస్తున్న మల్లూరుకు చెందిన వ్యక్తి, తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన మరో వ్యక్తి, జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పది మంది ముఠాగా ఏర్పడి గుట్టపై గుప్తనిధుల కోసం కొంత కాలంగా తవ్వకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు వారిపై నిఘా పెట్టి గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఈ దాడుల్లో గుప్తనిధుల ముఠాకు నాయకత్వం వహించిన ఫారెస్ట్ అధికారితో పాటు తాడ్వాయి మండలం కాటాపురంకు చెందిన వ్యక్తి మరో 6 గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. వారితో పాటు ఫారెస్ట్ అధికారి బైక్ మరో 6 బైక్ లను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసు అధికారులను ఫోన్ లో సంప్రదించగా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.