
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చి యువత స్థితి గతులను మార్చి మాట తప్పని ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3నెలల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాల అన్ని మతాల ప్రజలను కలుపుకొని 17కార్పోరేషన్ లు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ లో సమసమాజం స్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని బండి రమేష్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం సీఎం నివాసంలో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బండి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన రూ. 7 లక్షల కోట్ల ఆప్పును తప్పులను సరిచేస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాయకులు తెలంగాణ సంపదను దోచుకుతిన్నారని ధజమెత్తారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ ఏకతాటిపై ఉండి గెలిపిస్తామన్నారు. స్థానిక నాయకులకు అండగా ఉండాల్సి ఉందన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ జెండా రెప రెప లాడేలా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మల్కాజ్గిరి పార్లమెంటు సీటును గెలిచి బహుమతిగా ఇస్తామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గొప్పగా పోరాట పటిమ చూపిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గo పార్టీ కార్యకర్తలు అందర్నీ గుర్తించి గౌరవించాలని పార్టీ, ప్రభుత్వ పదవుల్లో వారికి పెద్దపేట వేయాలని బండి రమేష్ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.