Leading News Portal in Telugu

Kaushik Reddy: పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అని పిలవాలి..



Padi Koushik Reddy

Kaushik Reddy: పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే ఆవేశం స్టార్ అని పిలవాలని ఉందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ ని కోరుతున్నానని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఓట్లేసి మమ్మల్ని ప్రజలు గెలిపించారు.. అటువంటి మమ్మల్ని అధికార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయొద్దని ఎలా అంటారని తెలిపారు. ఆర్డీవో కి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. సీఎస్ కి కంప్లైంట్ చేశానని అంటున్నారు మంత్రి అని అన్నారు. ప్రమాణం కి భిన్నంగా ప్రవర్తిస్తున్న మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయవద్దు? అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే ఆవేశం స్టార్ అని పిలవాలని ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Sircilla Crime: అమానుషం.. వివాహితపై అత్యాచారం, ఆపై హత్య..!

ఇట్లాంటి పనులు చేస్తేనే కరీంనగర్ ప్రజలు తన్ని తరిమితే ఎక్కడికో పారిపోయారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కు తోడు ఏడో గ్యారంటీ ఈ మంత్రి ఆవేశం మని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తే ఇబ్బందులు పడతారన్నారు. మంత్రి మాటలు వింటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలెక్షన్ కోడ్ వున్నప్పుడు నిన్న కమలపూర్ లో కల్యాణ లక్ష్మీ చెక్కులు పంచారు.. తులం బంగారం ఏదీ…? అని ప్రశ్నించారు. పోలీసుల అలవెన్స్ లు పిఆర్సీలు ములుగులో సీతక్క ఇచ్చారు కరీంనగర్ లో ఎందుకు ఇవ్వడం లేదు..? అని అన్నారు. కరీంనగర్ లో లక్ష ఓట్ల మెజార్టీతో ఎంపీ సీట్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu: కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు త్యాగాన్ని మరువలేను..