Leading News Portal in Telugu

RangaReddy: ఆర్టీసీ బస్సులో రూ.16 లక్షల నగదు.. సీజ్‌ చేసిన అధికారులు



Rangareddy Money Sized

RangaReddy: ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం. బ్యాంకుల నుంచి రూ.ల‌క్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు ఈసీ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే వీటిపై తెలంగాణ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద రాత్రి పోలీసులు చేసిన తనిఖీలు చేపట్టారు. ఓ ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించగా అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తో పాటు వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటిని వెంటనే సీజ్ చేశారు. TS 08 Z 0098 వనపర్తి నుండి హైదరాబాద్ బస్సులో జయదేవ్ అనే యువకుడి వద్ద 16 లక్షల 50వేల నగదు, ఐదున్నర కిలోల వెండి తరలిస్తుండటంతో అధికారులు పట్టుకున్నారు. అయితే వాటికి సంబందించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Read also: Viral Video: పట్టపగలే బాలిక పై కత్తితో దాడికి యత్నించిన యువకుడు.. చివరకి..?

తాజాగా.. గజ్వేల్ పట్టణంలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్‌కు చెందిన కారు (టీఎస్‌36సీ 0198)లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు స్వాధీనం చేసుకోలేదు. ఈ సందర్భంగా గజ్వేల్ సీపీ అనురాధ మాట్లాడుతూ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు. అధికంగా తీసుకెళ్లినట్లయితే సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలి. లేని పక్షంలో ఆ మొత్తాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. డబ్బును ఐటీ శాఖకు అప్పగిస్తామని, సరైన ధ్రువపత్రాలు చూపించి బాధితులు విడిపించుకోవచ్చని తెలిపారు.
Assam : ఐఎస్ఐఎస్‌లో చేరబోతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు