Leading News Portal in Telugu

Loksabha Election 2024: నేడు 8 లోక్ సభ స్థానలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్



Revanht Reddy

Loksabha Election 2024: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎలాగైనా లోక్ సభ స్థానాలల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి లోక్ సభ స్థానాలను తన సొంతం చేసుకునేందుకు వ్యహం రచిస్తోంది. ఈనేపథ్యంలో ఇవాళ తెలంగాణలో మిగిలిన 8 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే.. 8 స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది.. ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు.

Read also: Mudragada: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం నేను పని చేస్తా..

అయితే దీనిపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇవాల ఈ ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదిలాబాద్ సీటుకు ఆత్రం సుగుణ పేరును ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన సుగుణ.. ఖమ్మంలో తమ వారికి సీటు ఇప్పించుకునేందుకు సీనియర్ నేతల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. భునగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ సన్నిహితుల మధ్య పోటీ ఉంటుందని తెలుస్తుంది. చామల కిరణ్ కోసం రేవంత్ పట్టుబడుతున్నట్లు సమాచారం.
Holi Celebrations : హోలీలో సెలబ్రేషన్స్ కు కండీషన్స్.. ఇలా చేస్తే కఠిన చర్యలు