Leading News Portal in Telugu

Bandi Ramesh : కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం



Bandi Ramesh

కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం ఉంటాయని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ , బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని ఇతర పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలను సైతం కలుపుకొని పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు కెపిహెచ్బి కాలనీ 114 డివిజన్ కు చెందిన మహిళా నాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో కెపిహెచ్బి డివిజన్ కి చెందిన గంగా శివకుమారి ప్రధాన కార్యదర్శి, పుష్పారాణి, సంధ్య మరియు వారి అనుచరులు 30 మంది మహిళలు , కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సమక్షంలో బాలనగర్ లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన సుమారు వందమంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ బండిరమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఏ పార్టీకి లేనివిధంగా 136 సంవత్సరాల ఘనచరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ అని ఇలాంటి పార్టీలో పని చేయడం ప్రతి కార్యకర్త అదృష్టంగా భావించాలన్నారు.

కాంగ్రెస్ అంటేనే కార్యకర్తల కలయిక అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొక్కవోని దీక్షతో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు అభినందనీయులన్నారు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను మన ప్రియతమా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేస్తుందన్నారు. ఈ ఆరు గ్యారెంటీల్లోనూ మహిళలకు పెద్దపీట వేసేలా పధకాల రూపకల్పన జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వీటి ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు సీటును మొదటిసారిగా ఓ మహిళకు కేటాయించడం అభినందనీయమని బండి రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు ,ప్రతాప్ రెడ్డి, కొప్పిశెట్టి దినేష్ కుమార్, పుష్ప రెడ్డి, కరికే పెంటయ్య, రాజేందర్, శివ చౌదరి, అరుణ్, మధురి రాము , తదితరులు పాల్గొన్నారు.