
కచ్చితంగా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో మెదక్ నుంచి పోటీ చేద్దామని సర్వేలు చేసుకుని BRS గెలుస్తుందని తెలిసి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి రఘునందన్ పనిమంతుడు అయితే దుబ్బాకలో గెలిచేవాడు కదా అని ఆయన సెటైర్లు వేశారు. ముస్లింలకు కాంగ్రెస్ కేబినెట్‌లో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు అర్థం అవుతున్నాయని, 6 గ్యారెంటీలు వంద రోజుల్లో చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందన్నారు హరీష్ రావు.
CSK vs GT Dream11 Prediction: చెన్నై, గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
అంతేకాకుండా..’డిసెంబర్ 9నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదు. మాట తప్పడం కాంగ్రెస్ కి అలవాటు..ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతుంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు. ఢిల్లీలో కాంగ్రెస్ రాదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పారు. బడే భాయి చోట భాయి అంటూ బీజేపీ వాళ్ళతో చేతులు కలిపారు రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ 157 మెడికలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ తెలంగాణకి ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి తెలంగాణకి అన్యాయం చేశాయి. బీఆర్‌ఎస్ గెలవాలి….తెలంగాణ నిలవాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్దాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
BJP Protest: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆందోళన..