
MLC Kavitha: ఏప్రిల్ 9 వరకు ఎమ్మెల్సీ కవితకు స్పెషల్ కోర్ట్ జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కవిత మధ్యంతర బెయిలుపై ఒకటో తేదీన విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కవితను అధికారులు జైలుకు తరలిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యా్ప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం, ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత కస్టడీ నేటితో ముగిసింది. అయితే వాదోపవాదాలు ముగిసిన తరువాత స్పెషల్ కోర్టు కవితకు ఏప్రిల్ 9 అనగా 15 రోజులు రిమాండ్ విధించింది.
Read also: Kishan Reddy: ఎన్డీయే కూటమికి 400సీట్లు రావడం ఖాయం..!
కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్, ఈడీ కస్టడీ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరిని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. కవిత ఇప్పటికే 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో రూ.100 కోట్ల ముడుపులపై ఆరాతీసింది ఈడీ. ఈ వ్యవహారానికి కవిత నాయకత్వం వహించారని చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే తన కొడుకు పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఈ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు ఈడి సమయం కోరడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. అనంతరం కవితకు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
MLC Kavitha: నేను అప్రూవర్ గా మారేది లేదు.. కడిగిన ముత్యంలా బయటికి వస్తా..!