
Pulse Heart Hospitals: దేశంలో మొట్ట మొదటిసారిగా మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ హాస్పటల్స్ ఎండీ డాక్టర్ ముఖర్జీ తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా రోగికి చికిత్స చేసి విజయం సాధించామని డాక్టర్లు తెలిపారు. మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీతో కార్సినోయిడ్ గుండె జబ్బుతో బాధపడుతున్న 59 ఏళ్ల మహిళా రోగికి ట్రాన్స్‌కాథెటర్ పల్మనరీ వాల్వ్ రీప్లేస్మెంట్, ట్రైకస్పిడ్ వాల్వ్ రీప్లేస్‌మెంట్‌ను నిర్వహించి ఆమెకు పునర్జీవం కల్పించామన్నారు. మియాపూర్ పల్స్ హార్ట్ ఆస్పత్రి వైద్యులు. డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ నేతృత్వంలోని సర్జన్ల బృందం కార్సినోయిడ్ గుండె జబ్బుతో బాధపడుతున్న రోగికి కుడివైపు గుండె కవాటాలు ట్రైకస్పిడ్, పల్మనరీ వాల్వ్‌లు రెండూ తీవ్రంగా లీకేజికీ గురయ్యాయని గుర్తించారు.
దీంతో శస్త్ర చికిత్స లేకుండా రోగికి ట్రాన్స్‌కాథెటర్ పల్మనరీ వాల్వ్ రీప్లేస్మెంట్, ట్రైకస్పిడ్ వాల్వ్ రీప్లేస్‌మెంట్‌ను నిర్వహించారు. టీవీపీఆర్ అనేది భారతదేశంలోని ఎంపిక చేయబడిన కొన్ని వైద్య కేంద్రాలలో మాత్రమే చేయడానికి అవకాశం ఉన్న చాలా అరుదైన ప్రక్రియ, అయితే టీఆర్ ఐసీ వాల్వ్ భర్తీ కొరకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం అవసరమయ్యే మరింత అరుదైన ప్రక్రియ. ఈ రెండు విధానాలను ఒకే రోగిలో నిర్వహించడం అనేది ఒక ప్రత్యేకమైందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు చోట్ల ఇలాంటి చికిత్స నిర్వహించగా.. దేశంలో మియాపూర్ పల్స్ హార్ట్ ఆస్పత్రిలో నిర్వహించడం పట్ల డాక్టర్ ముఖర్జీ ఆనందం వ్యక్తం చేసారు. ప్రస్తుతం రోగి కోలుకుని చికిత్స తర్వాత నడుస్తుందని వైద్యులు అన్నారు.