Leading News Portal in Telugu

TS Electric Power: రికార్డుస్థాయిలో విద్యుత్తు వినియోగం.. మే నెల రికార్డులు మార్చిలోనే..



Telangana Eloctrical

TS Electric Power: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మే నెలలో నమోదైన రికార్డు వినియోగం మార్చి నెలలోనే నమోదు కావడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 289.697 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. మార్చి చివరి వారంలో నమోదైన రికార్డు మార్చి మొదటి వారంలో బద్దలైంది. నిరుడు మార్చి 30న రాష్ట్రంలో 15,497 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 8న 15,623 మెగావాట్లతో ఆ రికార్డును అధిగమించింది. ఈ ఏడాది మార్చి 14న అత్యధికంగా 308.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది.

Read also: KCR: కేసీఆర్ జిల్లాల పర్యటన.. ఎప్పుడంటే..

ఎండలు మండిపోతుండడం, వరుస సెలవుల కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండడంతో పట్టణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లోనే గృహ విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగింది. గ్రేటర్‌లో వినియోగదారుల సంఖ్య పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ వినియోగం రికార్డులను తిరగరాస్తోంది. మే 19న రికార్డు స్థాయిలో 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ నమోదైంది. గత గురువారం ఒక్కరోజే గ్రేటర్ లోనే రికార్డు స్థాయిలో 79.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం.

Read also: Padmavati Express: సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

ఇక మార్చిలో గ్రేటర్ విద్యుత్ వినియోగం 67.97 మిలియన్ యూనిట్లు మాత్రమే. మార్చి నెలలో సగటు విద్యుత్ వినియోగం 57.84 మిలియన్ యూనిట్లు. ఈ ఏడాది మార్చి వరకు సగటు విద్యుత్ వినియోగం 70.96 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. ఇది దాదాపు 22.7 శాతం పెరుగుదల. 15 జిల్లాలతో కూడిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ను పరిశీలిస్తే, 2023 మార్చి 3న 188.60 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, ఈ ఏడాది మార్చి 13న గరిష్ట వినియోగం 202.45 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
Mukhtar Ansari : ముఖ్తార్ అంత్యక్రియలకు..ఐజీ, డీఐజీ నుంచి 5000 మంది పోలీసుల మోహరింపు